News August 14, 2024
విశాఖలో అభివృద్ధి చేయాల్సిన టూరిస్ట్ స్పాట్ ఏది?
రాష్ట్రంలో రూ.300 కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని వేశారు. వీరు రుషికొండ భవనంపై అధ్యయనం చేయడంతో పాటు విశాఖ, SKLM, VZM జిల్లాలో కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించనున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగే విధంగా సూచనలిస్తారు. మరి మీ దగ్గర పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతం ఏదైనా ఉంటే కామెంట్ చెయ్యండి
Similar News
News September 15, 2024
విశాఖ: ఆ రైలు 5 గంటల ఆలస్యం
సంత్రాగచ్చి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు(07222) ఈరోజు 5 గంటల ఆలస్యంగా ప్రారంభం కానుంది. సంత్రాగచ్చి నుంచి 12:20 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. ఇవాళ సాయంత్రం 05:20 గంటలకు అక్కడ రైలు కదులుతుంది. ఈ ట్రైన్ దువ్వాడ స్టేషన్‌కు సోమవారం ఉదయం 8:20 గంటలకు చేరుతుంది. లింక్ రైలు ఆలస్యంగా నడుస్తున్నందున ఈ అసౌకర్యం కలిగినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
News September 15, 2024
విశాఖ: మానసిక వైద్యుడిపై కేసు
బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన మానసిక వైద్యుడు సతీశ్ కుమార్‌పై పీఎం పాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీతమ్మధారకు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్ చిన్న కుమార్తె ప్రతి చిన్న విషయానికి భయపడుతోంది. దీంతో మిధిలాపురి వుడా కాలనీలోని సతీశ్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో బాలికలకు క్లాస్ చెబుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడంతో ఈనెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 15, 2024
విశాఖ: సెలవు ఇవ్వాలని రైతుల వినతి
సాధారణంగా రైతులు, రైతు బజార్లకు సైతం వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది. విశాఖలోని సీతమ్మధార, కంచరపాలెం, ఎంవీపీ కాలనీ, అక్కయ్యపాలెం నరసింహ నగర్ రైతు బజార్లకు ఇదే తరహాలో సెలవు ఉండేది. దీనిని రద్దు చేస్తూ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమకు సెలవు కావాలంటూ రైతులు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు వినతిపత్రం అందజేశారు. సెలవు కొనసాగేలా మాట్లాడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.