News August 25, 2024

విశాఖలో ఆర్మీ ర్యాలీ.. ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

image

విశాఖ పోర్టు స్టేడియంలో ఈ నెల 26 నుంచి జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి భద్రత ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ శనివారం సాయంత్రం పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తొక్కిసలాటకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 5 వరకు జరిగే కార్యక్రమంలో లోటుపాట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News September 19, 2024

భీమిలి: కూల్చివేతలపై స్టేకు హైకోర్టు నిరాకరణ

image

భీమిలి బీచ్‌లో MP విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేయాలని జీవీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. రాజకీయ జోక్యంతో కూల్చివేతలను ఆపవద్దని సూచించింది. ఫొటోలను పరిశీలిస్తే బీచ్‌లోనే నిర్మాణాలు చేసినట్లు స్పష్టం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.

News September 19, 2024

విశాఖ: 4,972 మంది లైసెన్సులు తాత్కాలికంగా రద్దు

image

బైకర్‌లు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజారత్నం సూచించారు. గోపాలపట్నంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తున్న 4,972 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్‌లో 5,543 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

News September 19, 2024

రుషికొండలో ప్రతిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు

image

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎంతో ప్రీతికరమైన తిరుమల లడ్డూ ఇక నుంచి ప్రతి రోజూ విక్రయించనున్నట్లు ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు తెలిపారు. ఇప్పటి వరకు వారంలో మూడు రోజులు మాత్రమే విక్రయించే వారమని, భక్తుల కోరిక మేరకు ఇక నుంచి ప్రతి రోజూ విక్రయిస్తామని ఆయన వెల్లడించారు.