News March 21, 2025
విశాఖలో ఆశీల వసూళ్లకు బహిరంగ వేలం

జీవీఎంసీ జోన్ -3 పరిధిలో 2025-26 సంవత్సరానిగాను పార్కింగ్ రుసుము వసూలు చేసేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోన్-3వ జోనల్ కమిషనర్ శివప్రసాద్ గురువారం తెలిపారు. జోన్-3లో మార్కెట్లు, లుంబిని పార్క్ ప్రవేశానికి, పార్కింగ్ టికెట్ వసూలు చేసేందుకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆశీలుమెట్ట జీవీఎంసీ జోన్ -3 జోనల్ కార్యాలయంలోని హాజరు కావాలన్నారు.
Similar News
News April 1, 2025
విశాఖలో ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు విశాఖలోని ఆలిండియా రేడియో సమీపంలోని ఉత్కల్ సాంస్కృతిక సమాజ్ ప్రాంగణంలో మంగళవారం జరిగాయి. ఒడిశా ఫుడ్ ఫెస్టివల్ లో కాకారా చెనాపోడా, దహి బారా, గుగుని, మాల్పువా ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఉత్కల్ గౌరబ్ మధు సుదాన్ దాస్, ఉత్కలనీ గోపాబాధి వంటి గొప్ప వ్యక్తులకు నివాళులర్పించారు. ఐఆర్ఎస్ అధికారి రాజేంద్ర కుమార్, రైల్వే ఏడిఆర్ఎం మనోజ్ కుమార్ సాహు పాల్గొన్నారు.
News April 1, 2025
ఇప్పటి వరకు ఏడుగురు అరెస్ట్: విశాఖ సీపీ

ఆన్‌లైన్ లోన్ యాప్‌లో అప్పు తీసుకొని వేధింపులకు గురై విశాఖలో ఓ వ్వక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా అప్పుడు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ పోలీసులు వివిధ రాష్ట్రలకు వెళ్లి మరికొందరిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఆ కేసులో ఏడుగురుని అరెస్ట్ చేశారు. త్వరలో మిగతా ముద్దాయిలను పట్టుకుంటామని సీపీ వెల్లడించారు.
News April 1, 2025
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్షకు నాలుగేళ్లు

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ దీక్షా శిబిరం ఏర్పాటు చేసి మంగళవారం నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ అర్ధనగ్న ప్రదర్శన, ధర్నా స్టీల్ ప్లాంట్‌ని సెయిల్‌లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.