News March 1, 2025
విశాఖలో ఇంటర్ పరీక్షలు.. 95% హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు శనివారం విశాఖ జిల్లాలో 95% మంది హాజరయ్యారని ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి సుధీర్ తెలిపారు. జనరల్ పరీక్షలకు 41,945 మందికి 40,000 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 1,741 మందికి 1,635 మంది హాజరయ్యారు. అన్ని కోర్సులకు సంబంధించి 43,686 మందికి 41,634 మంది విద్యార్థులు హాజరు కాగా 2,052 గైర్హాజరు అయ్యారు. 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
Similar News
News March 15, 2025
విశాఖలో జూన్ 1నుంచి జరిమానా

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదామని ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్ అన్నారు. శనివారం విశాఖ ఆర్‌కె బీచ్ వద్ద స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జనవరి 1నుంచి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చెప్పినా అక్కడక్కడ కనిపిస్తూన్నాయన్నారు. జూన్ 1నుంచి సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులకు జరిమానాలు విధిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.
News March 15, 2025
గాజువాకలో బాలికపై అత్యాచారయత్నం..!

గాజువాకలో మైనర్‌పై అత్యాచారయత్నం కలకలం రేపింది. డ్రైవర్స్ కాలనీలో పదేళ్ల బాలికపై దాడి భాను ప్రకాష్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి చిన్నారి వారికి చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో భాను ప్రకాష్‌ని గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News March 15, 2025
ఒంటిపూట నిబంధన పాటించకుంటే చర్యలు: డీఈవో

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.