News February 28, 2025
విశాఖలో ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి

బైక్‌పై ప్రయాణించేవారికి హెల్మెట్ ధారణ తప్పనిసరి అని విశాఖ ఉప రవాణా కమీషనర్ ఆర్‌సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బైక్ నడిపే వ్యక్తి, వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ ధరించాలన్నారు. ఏ ఒక్కరు హెల్మెట్ ధరించకపోయినా జరిమానా విధిస్తామన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సు 3 నెలలు సస్పెండ్ చేసి, ఫైన్ వేస్తామన్నారు.
Similar News
News February 28, 2025
వీఈఆర్‌లో మౌలిక సదుపాయాలపై చర్చ

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర, పూర్వ తూర్పుగోదావరి జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల కలెక్టర్లతో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వర్చువల్ సమావేశంలో చర్చించారు. వీఎంఆర్డీఏ కార్యాలయం నుంచి ఈసమావేశంలో నీతి ఆయోగ్ పథక సంచాలకులు పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ కిషోర్, వీఎంఆర్డీఏ ఎంసీ విశ్వనాథన్ పాల్గొన్నారు.
News February 28, 2025
‘విశాఖను ప్రథమ స్థానంలో నిలపండి’

విశాఖలో 2024 స్వచ్ఛ సర్వేక్షన్‌లో ప్రథమ స్థానంలో నిలపాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్ సోమనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జోన్ -3 ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నేరుగా ముఖాముఖిగా, స్వచ్ఛత యాప్, వెబ్సైట్ లింకు ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. విశాఖ నగర అభివృద్ధికి, నగరాన్ని దేశంలోనే ప్రథమ స్థానం లక్ష్యసాధనకు ప్రజలుకు అవగాహన కల్పించాలన్నారు.
News February 28, 2025
ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడపాలి: విశాఖ కలెక్టర్

జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగు హాలులో డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. గాజువాక, ఆటోనగర్, పెదగంట్యాడ, అగనంపూడిలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం గుర్తించాలన్నారు. ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడపాలని ఆదేశించారు.