News July 24, 2024

విశాఖలో ఈనెల 27న బీచ్ కబడ్డీ జట్ల ఎంపిక

image

జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న ఉమ్మడి విశాఖ జిల్లా బీచ్ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక జరుగుతుందని సంఘం కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాదరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం 3 గంటలకు ఆర్కేబీచ్ సమీపంలో విశాఖ ఉమ్మడి జిల్లా పురుషులు, మహిళల బీచ్ కబడ్డీ జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైన వారు విశాఖ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారని పేర్కొన్నారు.

Similar News

News October 19, 2025

21న విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

image

మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 4:35 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్‌కి వెళ్తారు. ఉదయం 9:30 గంటలకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం జీవీఎంసీలో జరిగే రివ్యూలో పాల్గొని ఆరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైన్‌లో బయలుదేరి ఒంగోలు వెళ్తారు.

News October 18, 2025

బీచ్‌లో లైట్లు ఏవి..? అధికారులపై మేయర్ ఆగ్రహం

image

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం రాత్రి ఆర్కే బీచ్ పరిసరాలను పరిశీలించారు. బీచ్‌లో విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేయనందుకు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఆదేశించినా చర్యలు తీసుకోలేదని మేయర్‌ విమర్శించారు. బీచ్‌లో హైమాస్ట్‌ లైట్లు వెలగక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే పరిశుభ్రతపై శ్రద్ధ వహించి, బీచ్‌ అందాన్ని కాపాడాలని సూచించారు.

News October 18, 2025

విశాఖ-పార్వతీపురం మధ్య స్పెషల్ ట్రైన్

image

దీపావళి రద్దీ దృష్య్టా ఈనెల 27 వరకు విశాఖ-పార్వతీపురం మధ్య మెము స్పెషల్ ట్రైన్ నడవనుంది. విశాఖలో ఉ.10కు బయలుదేరి పార్వతీపురం మ.12.20కు చేరుకుంటుంది. తిరిగి పార్వతీపురంలో మ.12.45కు బయలుదేరి బొబ్బిలి 1.10కు చేరుకుని విశాఖ సా.4గంటలకు వెళ్లనుంది. సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరంలో ఆగనుంది. > Share it