News December 2, 2024
విశాఖలో ఈనెల 30న పోస్టల్ అదాలత్ నిర్వహణ

పోస్టల్ డాక్/పెన్షన్ అదాలత్ను ఈ నెల 30న ఉదయం 11.00 గంటలకు ఎంవీపీ కాలనీలోని పోస్టల్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ భవనంలో నిర్వహించనున్నట్లు ఆర్.ఎం.ఎస్. -వి- డివిజన్ సూపరింటెండెంట్ ప్రసన్నరెడ్డి తెలిపారు. ఆర్.ఎం.ఎస్.(రైల్వే మెయిల్ సర్వీసెస్) -వి- డివిజన్ పరిధిలోని ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన తపాలా సేవలు, పింఛన్లపై ఫిర్యాదులు 23 వరకు స్వీకరిస్తారు.
Similar News
News November 5, 2025
గాజువాక: ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు కాజేశారు

గాజువాకలో భార్యాభర్తలిద్దరినీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చట్టివాణిపాలేనికి చెందిన అలేఖ్య నర్సింగ్ చదువుతుండగా.. భర్త వినాయకరావు బీటెక్ చదివాడు. ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మల్కాపురానికి చెందిన మచ్చ సజిని, నారాయణ రూ.91 లక్షలు కొట్టేశారు. వీరికి శ్రీహరిపురానికి చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్య కుమార్, సీరపు రాంప్రసాద్, సీరపు అనిత సహకరించారు.
News November 5, 2025
ఆరిలోవ రైతు బజార్లో స్టాళ్ల కేటాయింపునకు డ్రా

ఆరిలోవ రైతు బజార్లో ఖాళీగా ఉన్న స్టాళ్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. అక్టోబర్ 22న డ్రా ద్వారా 50 మంది రైతులకు స్టాళ్లు కేటాయించగా.. నేడు డ్వాక్రా సభ్యుల కోసం 10 స్టాళ్లు, వికలాంగుల కోసం ఒక స్టాల్ కేటాయించనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో డ్రా నిర్వహించి తుది కేటాయింపులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు
News November 4, 2025
విశాఖ: మనస్తాపంతో CA విద్యార్థి ఆత్మహత్య

సీఏ చదువుతున్న విద్యార్థి విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ ఎర్రంనాయుడి వివరాల ప్రకారం.. CA విద్యార్థి అఖిల్ వెంకట వంశీ ఆరిలోవలో నివాసం ఉంటున్నాడు. అన్ని పరీక్షలు పాస్ అయినట్లు ఇంట్లో అబద్దం చెప్పినందుకు మనస్తాపం చెందాడు. దీంతో పరీక్షల నిమిత్తం కొబ్బరి తోటలో తీసుకున్న రూమ్ వద్దే మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.


