News April 8, 2025
విశాఖలో ఈ ఏరియాలకు రిపోర్టర్లు కావలెను

విశాఖ నగరంలోని కొమ్మాది, జగదాంబ జంక్షన్, కేజీహెచ్, పోర్ట్ ఏరియా, పద్మనాభం, ఎండాడ, కైలాసగిరి, గాజువాక ఏరియాల్లో వే2న్యూస్‌లో పని చేసేందుకు రిపోర్టర్లు కావలెను. పబ్లిష్ అయిన ప్రతి వార్తకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింక్‌పై <
Similar News
News February 27, 2026
హోలీ పండుగ రద్దీ దృష్ట్యా విశాఖ- పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం – పాట్నా మధ్య రెండు ప్రత్యేక రైళ్లను (08537/08538) నడపాలని వాల్తేరు రైల్వే విభాగం నిర్ణయించింది. మార్చి 1, 8 తేదీల్లో విశాఖ నుంచి, మార్చి 2, 9 తేదీల్లో పాట్నా నుంచి ఈ రైళ్లు బయలుదేరుతాయి. విజయనగరం, బొబ్బిలి, రాయగడ మీదుగా నడిచే ఈ రైలు సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.
News February 27, 2026
విశాఖ: రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి

విశాఖ రైల్వే స్టేషన్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు జిల్లా కోర్టులో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు సిబ్బంది మృతితో తోటి ఉద్యోగుల్లో విషాదం నెలకొంది.
News February 27, 2026
మార్చి 3న కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనాలు నిలిపివేత

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదిన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30వరకు కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ శోభారాణి తెలిపారు. ఆరోజు ఉదయం పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేయనున్నట్టు తెలిపారు. గ్రహణానంతరం రాత్రి సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు అనుమతిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.


