News January 25, 2025
విశాఖలో ఈ రోజు జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు

విశాఖలో శనివారం జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వాహకులు తెలిపారు.➣ఉదయం 7.30కి సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్, సైబర్ సెక్యూరిటీ అంశంపై బీచ్ రోడ్డు, తెలుగు తల్లి విగ్రహం నుంచి వాకథాన్➣ఉదయం 10గంటలకు TDP కార్యాలయంలో హోంమంత్రి అనిత ప్రెస్ మీట్➣ఉదయం 10 గంటలకు KGHలో వెల్నెస్ సెంటర్ ప్రారంభం➣ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ప్రెస్ మీట్➣మధ్యాహ్నం 12 గంటలకు ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి అంశంపై CPM సదస్సు
Similar News
News February 12, 2025
భీమిలి: బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటనపై కేసు నమోదు

లీలా వరప్రసాద్ ఇద్దరు స్నేహితులతో సోమవారం రాత్రి టిఫిన్ కోసం వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. ఓ కాలేజీ సమీపంలో వారిని భయపెట్టి, కొట్టి రూ.1,000 లాక్కున్నారు. మరో రూ.5,000 తీసుకురమ్మని ముగ్గురు స్నేహితుల్లో ఒకరిని పంపించి బెదిరించారు. భీమిలి పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 12, 2025
రూ.4కోట్లతో సింహాచలం ఆలయ పైకప్పుకు మరమ్మతులు

సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. దేవాలయ కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సున్నం, అరబిక్ చెట్ల జిగురు, బెల్లం, జనపనార మిశ్రమాన్ని వాడి లీకేజీలు నివారిస్తామన్నారు.
News February 12, 2025
విశాఖ: వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష

కేంద్ర పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కేంద్ర బృందం డాక్టర్ పాదాలు, రమణ మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సిబ్బంది, అధికారుల పని తీరు సమీక్ష చేసి పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి సిబ్బంది హాజరును పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో DMHO జగదీశ్వరరావు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు.