News January 11, 2026
విశాఖలో ఉప లోకాయుక్త క్యాంప్ సిట్టింగ్

విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 29, 30వ తేదీల్లో ఏపీ ఉప లోకాయుక్త పి.రజని ఆధ్వర్యంలో క్యాంప్ సిట్టింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఈ క్యాంప్‌లో పాల్గొని ప్రభుత్వ అధికారుల అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై కొత్త ఫిర్యాదులు అందజేయవచ్చునని ఆమె తెలిపారు. పారదర్శక పాలనే లక్ష్యంగా జరిగే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News January 16, 2026
BIG BREAKING: మేడారంలో క్యాబినెట్ మీటింగ్.. జరిగేది అక్కడే!

మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 18న సా.5 గంటలకు మేడారంలోని హరిత హోటల్‌లో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్నామని స్పష్టం చేస్తూ తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులందరూ పాల్గొననున్నారు. కాగా రాజధానిలో కాకుండా తొలిసారిగా ఇతర ప్రాంతంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News January 16, 2026
రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన MSVPG

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్ల లోపల ఈలలు, బయట హౌజ్‌ఫుల్ బోర్డులు.. రూ.200 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు’ అని రాసుకొచ్చింది. వీకెండ్ కావడంతో రేపు, ఎల్లుండి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.
News January 16, 2026
IFFCOలో అప్రెంటిస్ పోస్టులు

<


