News June 6, 2024
విశాఖలో ఎండీఎంఏ పౌడర్ స్వాధీనం
విశాఖ నగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు గ్రాముల ఎండీఎంఏ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పౌడర్ కలిగి ఉన్న ఒక యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఎండీఎంఏ పౌడర్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు.. దీనిని ఎవరు సరఫరా చేశారనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 11, 2024
విశాఖ: 14న అన్ని న్యాయస్థానాల్లోనూ లోక్ అదాలత్
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లోనూ ఈనెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహార కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చునన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News December 10, 2024
విశాఖ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
విశాఖలోని స్కానింగ్ సెంటర్లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. <<14841020>>మహిళపై అసభ్యంగా <<>>ప్రవర్తించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
News December 10, 2024
పలు అభివృద్ధి పనులకు వీఎంఆర్డీఏ ఆమోదం
వీఎంఆర్డీఏ పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసింది.➤ రూ.200 కోట్లతో సముద్రతీరం కోతకు గురి కాకుండా చర్యలు ➤ ఋషికొండ, గంభీరం వద్ద వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ➤ రుషికొండ వద్ద హ్యాబిటేట్ సెంటర్ ఏర్పాటు ➤ మధురవాడలో ఒలింపిక్ స్టాండర్డ్స్ అనుగుణంగా రూ.3 కోట్లతో క్రీడా మైదానం ఏర్పాటు ➤ రూ.9 కోట్లతో 15 ప్రాంతాల్లో రహదారుల ➤ అనకాపల్లి వద్ద హెల్త్ సిటీ పనులకు ఆమోదం