News March 25, 2025

విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. వారికి తీపి జ్ఞాపకం

image

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ 30 మంది అనాథ‌ చిన్నారులకు చూసే అవ‌కాశం క‌ల్పించింది. సొంత నిధుల‌తో 30 టికెట్స్ కొని వైజాగ్‌లోని పాపా హోమ్ అనాథ శ‌ర‌ణాల‌యానికి అంద‌జేశారు. ఈ సందర్భంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియానికి వెళ్లారు.

Similar News

News March 31, 2025

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రంజాన్ : VZM SP

image

విజయనగరం జిల్లాలో రంజాన్ పండగ హిందూ – ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెల్లుబికి, పండగలో ఎటువంటి మత విద్వేషాలు, సంఘర్షలు, అల్లర్లు జరగకుండా ప్రశాంతయుతంగా ముగిసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు భద్రత చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు.

News March 31, 2025

బొబ్బిలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

బొబ్బిలి సమీపంలోని దిబ్బగుడివలస – గుమ్మడివరం మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని GRP హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. సదరు వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెంది ఉంటాడని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని ఎవరైనా గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News March 31, 2025

గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఉగాది రోజు ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్‌లో కులిమిశెట్టి కృష్ణ (65)ను ఆదివారం ఓ బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణను స్థానికులు విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు గంట్యాడ SI సాయకృష్ణ సోమవారం తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

error: Content is protected !!