News March 30, 2024

విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌.. స్కోరర్‌గా విజయనగరం వ్యక్తి

image

విజయనగరానికి చెందిన బీసీసీఐ స్కోరర్ తోట విజయ్‌ను మార్చి31, ఏప్రిల్ 3న విశాఖపట్నంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు స్కోరర్‌గా నియమించినట్లు ఏపీ క్రికెట్ సంఘం కార్యదర్శి గోపీనాథ్ శుక్రవారం తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు స్కోరర్‌గా విజయ్ వ్యవహరించనున్నారు.  

Similar News

News April 17, 2026

VZM: స్వయంగా స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్

image

జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్వీయ గణన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవాలని అన్నారు.

జలధారతో భూగర్భ జలమట్టం పెంచాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో జలధార-నీటి భద్రత కింద చేపడుతున్న పనుల ద్వారా భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం వర్చువల్‌గా మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 215 ప్రాధాన్యత గ్రామాల్లోని 1,679 చెరువులకు అంచనాలు సిద్ధం చేసి పంపాలని, జిల్లాలోని 8,010 చెరువులకు పనులు గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పనులను ఉపాధి హామీ పథకం కింద నమోదు చేయాలన్నారు.