News May 9, 2024
విశాఖలో ఓటు వేస్తే.. హెయిర్ కట్ ఫ్రీ
దేశ తలరాతను మార్చే ఓటు విలువను తెలియజేస్తూ కంచరపాలెంకు చెందిన ఓ సెలూన్ షాపు వినూత్న కార్యక్రమం చేపట్టింది. కంచరపాలెంకు చెందిన ఓ షాపు యజమాని ఓటేసే వారకి ఉచితంగా హెయిర్ కట్ చేస్తామని ప్రకటించారు. ఓటుకు ఉన్న ప్రాముఖ్యత తెలియచేయాలనే ఉద్దేశంతో తన బృందంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
Similar News
News January 24, 2025
శకటంలో 30కి పైగా ఏటికొప్పాక బొమ్మలు
ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఏటికొప్పాక లక్కబొమ్మల శకటం ఎంపికైన సంగతి తెలిసిందే. ఏటికొప్పాకకు చెందిన కళాకారుడు గోర్స సంతోశ్ తయారుచేసిన ఈ శకటంలో 30కి పైగా లక్క బొమ్మలు ఉంటాయి. వీటిలో వెంకటేశ్వర స్వామి, వినాయకుడుతో పాటు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభింబించే లక్క బొమ్మలు ఉంటాయని సంతోశ్ తెలిపారు. NOTE: పైనున్న ఫొటోలో నమూనాను చూడొచ్చు.
News January 24, 2025
విశాఖలో కిడ్నాప్ కలకలం
విశాఖలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువతి పెద్దపాలెం చెందిన రామారావు అనే వ్యక్తికి పలుమార్లు ఫోన్ చేసి ట్రాప్ చేసింది. తగరపువలస సమీపంలో గుడి వద్దకు రావాలని చెప్పడంతో ఆయన వెళ్ళగా నలుగురు యువకులు కిడ్నాప్ చేసి ATM కార్డు, రూ.48,000 నగదు దోపిడీ చేశారు. ఏటీఎంలో రూ.7వేలు డ్రా చేయడంతో రామారావు మోసపోయినట్లు గ్రహించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రాప్ చేసిన యువతి ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు.
News January 24, 2025
పాయకరావుపేటలో ఎయిర్ పోర్ట్‌కు ప్రతిపాదనలు
పాయకరావుపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ముందు తుని-అన్నవరం మధ్య ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రాంతం అనుకూలం కాదని ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు సమాచారం. పాయకరావుపేట ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండడంతో నిర్మాణానికి అన్ని విధాల అనుకూలమని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు భూముల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.