News January 22, 2025
విశాఖలో కంపెనీలు పెట్టండి: మంత్రి లోకేశ్

పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేశ్ దావోస్లో పర్యటిస్తున్నారు. విశాఖలో ఆటో మొబైల్ ఉత్పత్తి, సప్లయ్ చైన్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ZF ఫాక్స్కాన్ CEO దృష్టికి తీసుకెళ్లారు. సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాట్సోడస్ను కోరారు. గ్లోబల్ డెలివరీ కేంద్రాలు, బ్యాక్ ఎండ్ ఐటీ ఆఫీస్ ఏర్పాటు చెయ్యాలని రాజీవ్ మోమానీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 1, 2025
పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని డిమాండ్

సింహాచలం దేవస్థాన పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని నిర్వసితులు డిమాండ్ చేశారు. ఆదివారం సింహాచలంలో నిర్వసితులు ధర్నా నిర్వహించారు. పంచగ్రామాల సమస్య హైకోర్టులో కేసు ఉందన్న కారణంతో ప్రభుత్వాలు ఏళ్ల తరబడి సమస్యను పరిష్కరించడంలేదన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఐటీ కంపెనీల కోసం వందల ఎకరాల దేవస్థానం భూములను కట్టబెడుతున్నారని, పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం కనీసం చర్చించడం లేదని మండిపడ్డారు.
News November 30, 2025
రాజ్యాంగ రక్షణకు సైన్యం కావాలి: పరకాల ప్రభాకర్

భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని కాపాడుకోవడానికి దళిత, బహుజన సైన్యం ఏర్పడాలని ప్రముఖ ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. విశాఖలో అంబేద్కర్ భవన్లో ఆదివారం “భారతదేశ రాజకీయాలు- రాజ్యాంగ నైతికత సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ రాజధానిలో ఊర కుక్కలపై ఉన్న స్పందన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుతో దాడికి స్పందన రాకపోవటం విచారకరమన్నారు. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమేనన్నారు.
News November 30, 2025
విశాఖ: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్’

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నవంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


