News January 22, 2025

విశాఖలో కంపెనీలు పెట్టండి: మంత్రి లోకేశ్

image

పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేశ్ దావోస్‌లో పర్యటిస్తున్నారు. విశాఖలో ఆటో మొబైల్ ఉత్పత్తి, సప్లయ్ చైన్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ZF ఫాక్స్‌కాన్ CEO దృష్టికి తీసుకెళ్లారు. సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాట్సోడస్‌ను కోరారు. గ్లోబల్ డెలివరీ కేంద్రాలు, బ్యాక్ ఎండ్ ఐటీ ఆఫీస్ ఏర్పాటు చెయ్యాలని రాజీవ్ మోమానీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Similar News

News February 11, 2025

విశాఖలో దివ్యాంగ పిల్లల్ని గుర్తించేందుకు సర్వే

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో ఇంటింటికి వెళ్లి దివ్యాంగ పిల్లల్ని గుర్తించే కార్యక్రమం సోమవారం దండు బజార్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ పాల్గొన్నారు. ఈనెల 24వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అంగ వైకల్యం ఉన్న పిల్లలకు వైద్యం అందిస్తే చిన్నతనంలోనే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

News February 10, 2025

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ బ్యాటరీ-2లో లిడ్ ఓపెన్ నుంచి మంటలు వ్యాపించడంతో నాగ శ్రీనివాసరావు అనే కార్మికుడు గాయాల పాలయ్యాడు. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 10, 2025

వైసీపీ ముఖ్య నేతలతో గుడివాడ సమావేశం

image

విశాఖ వైసీపీ ఆఫీసులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో ఇటీవల నియమించిన అనుబంధ సంఘాల అధ్యక్షులతో పలు విషయాలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, రమణికుమారి ఉన్నారు.

error: Content is protected !!