News September 25, 2024
విశాఖలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

ఆరిలోవ బాలాజీ నగర్లో దారుణం చోటుచేసుకుంది. సమాజం సిగ్గుపడే విధంగా ఓ తండ్రి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్సై కృష్ణ వెల్లడించారు. ఒడిశాకు చెందిన వ్యక్తి భార్యా, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. పెద్ద కుమార్తె స్కూల్లో పలుమార్లు కళ్లు తిరిగి పడిపోవడంతో ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే సమాచారం తల్లికి తెలిపారు. బుధవారం తల్లి పోలీసులను ఆశ్రయించింది.
Similar News
News October 17, 2025
విశాఖ: అక్టోబర్ 18న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు

అక్టోబర్ 18న మూడవ శనివారం “CLEAN AIR” అనే కాన్సెప్ట్‌పై స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి క్లీన్ ఎయిర్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఆరోజున శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
News October 16, 2025
విశాఖ పోలీసుల ఫైన్లపై మీరేమంటారు..!

విశాఖలో గత 15నెలల్లోనే పోలీసులు 8.54 లక్షల ఈ-చలాన్లు జారీ చేసి రూ.46.4కోట్ల ఫైన్ విధించారు. ఇప్పటి వరకు రూ.13.39కోట్లు రాబట్టారు. నగరంలో 12 లక్షల వాహనాలు ఉండగా.. కొందరు సిగ్నల్ జంప్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రతి 2రోజులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు.మరోవైపు షాపులు, రైతుబజార్ల వద్ద పార్క్ చేసిన వాహనాలకూ ఫైన్లు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.
News October 16, 2025
విశాఖలో ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే.. నిషేధం ఎక్కడా?

GVMC పరిధిలో పాలిథిన్ వినియోగం ఆగడం లేదు. ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించినా.. అమలు మాత్రం జరగడం లేదు. మార్కెట్లు, కిరాణా షాపులు, కూరగాయల సంతలు ఇలా ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లు సులభంగా దొరుకుతున్నాయి. GVMC అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిషేధం కేవలం ప్రకటనలకే అంకితమైందని పలువురు విమర్శిస్తున్నారు. కాలుష్యం పెరిగి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోతున్నా చర్యలు లేవని మండిపడుతున్నారు.