News November 14, 2024

విశాఖలో కబ్జాలను ఆధారాలతో నిరూపిస్తా: బండారు

image

విశాఖలో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరిగాయని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీలో ప్రస్తావించారు. సుమారు రూ.3వేల కోట్లు విలువ చేసే 300 ఎకరాల భూమిని వైసీపీ హయాంలో ప్రజలను భయపెట్టి లాక్కున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి హస్తం ఇందులో ఉందని తనకు అవకాశం ఇస్తే పూర్తి ఆధారాలతో నిరూపిస్తా అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపట్టాలని బండారు కోరారు.

Similar News

News December 6, 2024

విశాఖ: NAD కొత్త రోడ్డులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖ పరిధి NAD కొత్త రోడ్డులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ ఢీ కొట్టడంతో అడ్వకేట్ మృతి చెందారు. మృతుడు మర్రిపాలెం ఉడా కాలనీకి చెందిన పోతుల సూర్యనారాయణగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకి తరలించారు.

News December 6, 2024

విశాఖ: కామాంధునికి పాతికేళ్ల జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధునికి విశాఖపట్నం పోక్సో కోర్టు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. తీర్పులో భాగంగా నిందితునికి 25 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.1,25,000 జరిమానా విధించింది. సబ్బవరం మండలానికి చెందిన ఓ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో ప్రవేశపెట్టగా శిక్ష విధించారు.

News December 6, 2024

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే గంటా భేటీ   

image

విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో సీఎంతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు భేటీ అయ్యారు. అనంతరం కాసేపు పలు విషయాలపై చర్చించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు గంటా వివరించారు.