News August 3, 2024
విశాఖలో ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్ర యూనిట్ సందడి
‘కమిటీ కుర్రాళ్లు’ చిత్ర యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర నిర్మాత నిహారిక కొణిదల విశాఖలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇందులో పెద్దోడు పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. కాగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
Similar News
News September 13, 2024
విశాఖ: బ్లాస్ట్ ఫర్నేస్-3 ని మూసివేసిన అధికారులు
అతిపెద్ద కర్మాగారం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్ -3ని అధికారులు మూసివేశారు. బొగ్గు లేకపోవడం వల్ల దీనిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్ -1 మూతపడింది. రూ8 వేల కోట్ల అప్పుల్లో స్టీల్ ప్లాంట్ మునిగిపోయినట్లు కార్మికులు తెలిపారు.
News September 13, 2024
వరద బాధితుల కోసం విశాఖ పోర్టు రూ.కోటి విరాళం
విజయవాడల వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.కోటి విరాళం ఇచ్చింది. పోర్ట్ కార్యదర్శి టి.వేణు గోపాల్, వివిధ విభాగాధిపతులు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్‌కు సంబంధిత నగదు చెక్‌ను అందజేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందజేశారని యాజమాన్యం తెలిపింది.
News September 13, 2024
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిజిటలైజేషన్ ప్రక్రియ
ఏయూలో 23 లక్షల ధ్రువపత్రాలను 1996 నుంచి డిజిటలైజేషన్ చేస్తామని ఏయూ వీసీ శశిభూషణరావు తెలిపారు. ఇందులో మార్కుల జాబితాలు, ఓడీలు ఉంటాయన్నారు. 2023 నుంచి ఏయూలో చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను అకాడమీ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)లో ఉంచుతామన్నారు. ఏబీసీకి సంబంధించి ప్రతి విద్యార్థికి ఒక కోడ్ ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను ఒక సంస్థకు అప్పగిస్తామన్నారు.