News July 28, 2024

విశాఖలో కానిస్టేబుల్ సస్పెన్షన్

image

విశాఖ 4వ పోలీస్ స్టేషన్‌ పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్న ఓ కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. స్టేషన్ నుంచి న్యాయస్థానం వ్యవహారాలు చూసే కానిస్టేబుల్ హరీశ్ వ్యవహారంపై గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సీపీకి పంపించారు. వచ్చిన ఆరోపణలపై పూర్తి ఆధారాలు సేకరించిన అధికారులు అతనిని సస్పెండ్ చేశారు.

Similar News

News October 25, 2025

విశాఖ: 69 మంది పోలీసులకు రివార్డులు

image

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 69 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.

News October 25, 2025

మంత్రి సత్యకుమార్ విశాఖ పర్యటన వివరాలు

image

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అక్టోబర్ 26, 27 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అక్టోబర్ 27న ఉదయం ఏఎంసీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం VIMS క్యాంపస్, ఆరిలోవలో ప్రాంతీయ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం లాసెన్స్ బేలోని బీజేపీ కార్యాలయంలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

News October 25, 2025

విశాఖ మత్స్యకారులకు గమనిక

image

తుఫాను ఏర్పడిన నేపథ్యంలో సముద్రంపై మత్సకారులకు వేటకు వెళ్లొద్దని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు సూచించారు. బీచ్ రోడ్డులోని జాలరిపేట వద్ద తుఫాన్ విషయంపై ముందస్తు జాగ్రత్తలు వివరించారు. సముద్రంలో వేట సాగిస్తున్న ఫిషింగ్ బోట్లు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలన్నారు. తీరంలో భద్రపరచుకున్న సామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నారు. సమస్య ఎదురైతే వెంటనే సమాచారం అందించాలన్నారు.