News October 8, 2024

విశాఖలో కార్పొరేటర్‌పై రౌడీ షీట్

image

జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేశ్‌పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వైసీపీకి చెందిన సురేశ్‌పై అనేక కేసులు నమోదు అయినట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు. సొంత పార్టీ నాయకుల ఫిర్యాదుతోనే నాలుగు కేసులు ఆయనపై నమోదయ్యాయి. దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడడంతో ఆయనపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Similar News

News November 2, 2025

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి: ఏసీబీ డీజీ

image

ప్రతి ఒక్కరు అవినీతికి వ్యతిరేకంగా పోరాడితేనే ఫలితం ఉంటుందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా పాత బస్టాండు స్టేడియం వద్ద భారీ ర్యాలీ ప్రారంభించారు. అవినీతిపై ఫిర్యాదు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు 1064 నంబర్‌కు తెలియజేయాలని సమిష్టిగా పోరాడితే అవినీతి పారద్రోలవచ్చని అన్నారు. రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News November 2, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు PGRS

image

విశాఖ కలెక్టరేట్‌లో ఈనెల 3న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News November 2, 2025

విశాఖలో కార్డన్ అండ్ సెర్చ్.. 9వాహనాలు సీజ్

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం “కార్డన్ & సెర్చ్” ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో సరియైన ధృవపత్రాలు లేని 9 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ దృష్ట్యా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.