News January 30, 2025
విశాఖలో కేంద్రమంత్రి కాన్వాయ్‌లో ప్రమాదం

విశాఖలో కేంద్రమంత్రి కుమార్ స్వామి, సహాయమంత్రి శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. షీలా నగర్ వద్ద 8 కార్ల కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతినగా మంత్రులు క్షేమంగా బయటపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 18, 2025
పాలకుర్తి నియోజకవర్గంలో 6 నూతన చెక్ డ్యాములు మంజూరు

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినతికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పాలకుర్తి మండలంలో 3 గ్రామాలు, కొడకండ్ల మండలంలో 2 గ్రామాలు, తొర్రూరు మండలంలో 1 గ్రామానికి మొత్తం రూ.31 కోట్లతో 6 చెక్ డ్యాములను మంత్రి మంజూరు చేశారు. ఈ సందర్భంగా MLA రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
News February 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 18, 2025
ఎల్లారెడ్డిపేట: బస్సు టైర్ పంచర్.. తప్పిన ప్రమాదం

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామ శివారులోని బస్సు టైర్ పంచర్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 110మంది ప్రయాణికులతో వెళుతుండగా బస్సు ఒక్క సైడు ఒరిగి ఆగిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి వన్ పల్లికి మరికొన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.