News April 7, 2025
విశాఖలో కేజీ అల్లం ధర ఎంతంటే?

విశాఖ 13 రైతు బజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సోమవారం కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ. కిలో) టమాట రూ.17, ఉల్లిపాయలు రూ.22, బంగాళా దుంపలు రూ.17, బెండకాయలు రూ. 28, కాకరకాయలు రూ.34, క్యారెట్ రూ.32/34, మునగ కాడలు రూ.24, అల్లం రూ.48, బరబాటి రూ.30, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, పాటల్స్ రూ.64, చామ రూ.26, దేవుడు చిక్కుడు రూ.60, గ్రీన్ పీస్ రూ.60గా ధరల నిర్ణయించారు.
Similar News
News April 8, 2025
మధురవాడ: కడుపు నొప్పి తాళలేక ఉరి వేసుకుని మృతి

కడుపునొప్పి తాళలేక ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం గ్రామానికి చెందిన చిత్తులూరి అప్పారావు(32) మధురవాడ రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటూ ఓ హోటల్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. సోమవారం కడుపునొప్పి తాళలేక ఉరి వేసుకున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. మృతుడు వదిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 8, 2025
విశాఖ: నేడు జూ పార్క్‌ను సందర్శించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజులు విశాఖ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ జూ పార్క్‌కు రానున్నారు. ఈ మేరకు జూ పార్కు క్యూరేటర్ మంగమ్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడ జరిగే ఎకో టూరిజం మీటింగ్‌లో పవన్ కళ్యాన్ పాల్గొంటారని చెప్పారు.
News April 8, 2025
విశాఖ: ‘జేఈఈ పరీక్షకు విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలి’

జేఈఈ పరీక్షకు ట్రాఫిక్ అంతరాయం వలన ఆలస్యంగా వెళ్లిన 30 మంది విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు.నాగరాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పెందుర్తి రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో జేఈఈ పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థులు ట్రాఫిక్ వలన హాజరు కాలేకపోయారని వీరందరికీ అవకాశం కల్పించాలని కోరారు.