News March 15, 2025

విశాఖలో కేజీ కీర రూ.26

image

విశాఖ 13 రైతు బజార్‌లో శనివారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.28, బెండ రూ.40, బీరకాయలు రూ.54, క్యారెట్ రూ.22/27, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.52, గ్రీన్ పీస్ రూ.54, వంకాయలు రూ.40/42, కీర రూ.26, గోరు చిక్కుడు రూ.38, పొటల్స్ రూ.86, బరబాటి రూ.38గా నిర్ణయించారు.

Similar News

News April 17, 2025

వైసీపీకి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా

image

జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక YCPకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నానని అధినేత జగన్‌కు లేఖ పంపారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరనున్నది అనేది తెలపలేదు. కాగా ఇవాళ ముగ్గురు YCP కార్పొరేటర్లు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న మేయర్‌పై అవిశ్వాసం పెట్టనున్న నేపథ్యంలో నంబర్ గేమ్ ఉత్కంఠగా మారింది.

News April 17, 2025

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రించిన ఎంపీ 

image

రాష్ట్ర ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ నంబ‌ర్ ద్వారా అన్ని ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌లు సుల‌భంగా పొంద‌వ‌చ్చ‌ని విశాఖ ఎంపీ శ్రీ‌భ‌ర‌త్, క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రించారు. ఈ నెంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టి ప్ర‌జ‌లకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవ‌చ్చన్నారు. 

News April 17, 2025

కేంద్ర హోంమంత్రి చేతులు మీదుగా పురస్కారం అందజేత

image

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే పరేడ్‌ గురువారం మద్యప్రదేశ్‌లో జరిగింది. ఈ వేడుకలలో విశాఖకు చెందిన సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరాధ్యుల శ్రీనివాస్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు లభించింది. ఈ అవార్డును శ్రీనివాస్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందజేశారు. 34 ఏళ్లకు పైగా దేశ భద్రతకు ఆయన చేసిన సేవలకి గాను ఈ పురస్కారం లభించింది.

error: Content is protected !!