News May 20, 2024
విశాఖలో కొండెక్కిన చికెన్ ధర

వేసవికాలం కావడంతో కోళ్ల పెంపకం తగ్గింది, దీంతో బ్రాయిలర్ కోళ్ల లభ్యత తగ్గడంతో విశాఖలో ధరలు పెరిగాయి. గడచిన రెండు నెలల్లో చికెన్ ధర రూ.230 నుంచి రూ.260 వరకు ఉండేది. సోమవారం దీని ధర రూ.296కు పెరిగింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 20 రోజుల్లో కిలోపై రూ.40 వరకు పెరిగింది. గుడ్లు ధరలు కూడా పెరుగుతున్నాయి. మార్చి నెలలో 100 గుడ్ల ధర రూ.425 ఉండగా నేడు రూ.550గా ఉంది.
Similar News
News December 11, 2025
విశాఖకు గూగుల్.. శంకుస్థాపన ఎప్పుడంటే?

విశాఖ ప్రజలకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. మరోవైపు విశాఖలోని ఐటీ హిల్స్‌పై 7ఐటీ కంపెనీలకు శుక్రవారం భూమిపూజ జరగనుంది. ఉదయం 11.30 గంటలకు నిర్వహించే కాగ్నిజెంట్ పూజలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 10, 2025
కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర శోభ

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీచక్రనవావర్ణార్చన, లక్ష్మీహోమం జరిగాయి. గురువారంభక్తుల రద్దీ దృష్ట్యా పూజా సమయాలను కుదించినట్లు ఈవో తెలిపారు. భక్తులు ఆన్లైన్, వాట్సాప్ (9552300009) ద్వారా దర్శనం, ప్రసాదం బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశామని, వీఐపీలు, వృద్ధులు నిర్ణీత సమయాల్లోనే రావాలని కోరారు.
News December 10, 2025
ఏయూలో డిసెంబర్ 15 నుంచి ‘సరస్’ ఎగ్జిబిషన్: కలెక్టర్

మహిళల స్వయం సాధికారత కోసం డిసెంబర్ 15 నుంచి 26 వరకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ‘సరస్’ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. దేశవ్యాప్తంగా 600 మంది డ్వాక్రా మహిళలు 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ ప్రదర్శనను ఆదరించాలని కలెక్టర్ కోరారు.


