News May 20, 2024
విశాఖలో కొండెక్కిన చికెన్ ధర
వేసవికాలం కావడంతో కోళ్ల పెంపకం తగ్గింది, దీంతో బ్రాయిలర్ కోళ్ల లభ్యత తగ్గడంతో విశాఖలో ధరలు పెరిగాయి. గడచిన రెండు నెలల్లో చికెన్ ధర రూ.230 నుంచి రూ.260 వరకు ఉండేది. సోమవారం దీని ధర రూ.296కు పెరిగింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 20 రోజుల్లో కిలోపై రూ.40 వరకు పెరిగింది. గుడ్లు ధరలు కూడా పెరుగుతున్నాయి. మార్చి నెలలో 100 గుడ్ల ధర రూ.425 ఉండగా నేడు రూ.550గా ఉంది.
Similar News
News December 6, 2024
విశాఖ: ‘ప్రజల ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది’
ప్రజల ఆరోగ్యం పైనే దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. డీప్ కాంక్లీవ్ పై విశాఖలో జరుగుతున్న సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యమే ఐశ్వర్వమని, అందుకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ముందుకు వెళ్లేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు.
News December 6, 2024
విశాఖలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
సీఎం చంద్రబాబు విశాఖ పర్యనటలో భాగంగా శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. మొదటి పార్టీ కార్యాలయంలో జరిగే అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కొంతసేపు పార్టీ నాయకులను, కార్యకర్తలతో భేటీ అవుతారు. 9:30 నిమిషాలకు నోవాటెల్‌లో “డీప్ టెక్నాలజీ సదస్సు- 2024″లో పాల్గొంటారు. సాయంత్రం వీఎంఆర్డీఏ అధికారులతో భేటీ అవుతారు. అనంతరం 06:45 ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని తిరిగి విజయవాడ వెళ్తారు.
News December 6, 2024
విశాఖ: NAD కొత్త రోడ్డులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
విశాఖ పరిధి NAD కొత్త రోడ్డులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీ కొట్టడంతో అడ్వకేట్ మృతి చెందారు. మృతుడు మర్రిపాలెం ఉడా కాలనీకి చెందిన పోతుల సూర్యనారాయణగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకి తరలించారు.