News November 19, 2024
విశాఖలో కొడాలి నానిపై ఫిర్యాదు
మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ టూ టౌన్ స్టేషన్‌లో TDP నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ TDP జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి, విల్లూరి తిరుమలదేవి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. వైసీపీలోని మరో కీలక నేతలు అంబటి రాంబాబు, రోజాపై కూడా ఫిర్యాదు చేశారు.
Similar News
News December 14, 2024
నేడు గుడ్లవల్లేరుకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.!
సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మండలంలోని డోకిపర్రుకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారని CMO అధికారులు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు భూసమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గంలో 5.40కి పోరంకి మురళి రిసార్ట్స్‌లో జరిగే NTR వజ్రోత్సవాలకు సీఎం హాజరవుతారన్నారు.
News December 14, 2024
నేడు డోకిపర్రు రానున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి రానున్నారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలలో చంద్రబాబు పాల్గొననున్నారు. భూ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపకులు, మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధినేత కృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో చంద్రబాబు పాల్గొంటారు.
News December 13, 2024
ఆ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు: వనితా రాణి
ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సభ్యుల స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 3 స్థానాలకు పోటీలో నిలిచిన సానా సతీశ్, బీద మస్తాన్(టీడీపీ)&ఆర్.కృష్ణయ్య(బీజేపీ) ఎన్నికయ్యారని ఆమె తెలిపారు. ఎన్నిక నిమిత్తం 6 నామినేషన్లు రాగా ఒకరి నామినేషన్ చెల్లలేదని, మిగతా ఇద్దరు ఉపసంహరించుకున్నారని వనితా రాణి చెప్పారు.