News November 1, 2024
విశాఖలో క్రైమ్ ఎస్ఐను సస్పెండ్ చేసిన సీపీ

ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి క్రైమ్ ఎస్ఐ ఎన్.జగదీశ్‌ను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ సస్పెండ్ చేశారు. ఇదే సంఘటనపై ద్వారక క్రైమ్ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ డి.బంగారుపాపపై శాఖపరమైన చర్యలకు మేజర్ పీఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు 79950 95799 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సీపీ పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఇద్దరు ట్రాఫిక్ ఎస్ఐలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 6, 2025
విశాఖ: మహిళలను కాపాడిన లైఫ్ గార్డ్స్

RK బీచ్ గోకుల్ పార్క్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళలను లైఫ్ గార్డ్స్ కాపాడారు. గురువారం ఉదయం మహారాణి పేటకు చెందిన కీర్తి ఉషారాణి, సునీత పూజా సామాగ్రిని సముద్రంలో వదలడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కెరటాల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోతుండగా లైఫ్ గార్డ్స్ గమనించి వారిని రక్షించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
News November 6, 2025
విశాఖ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ!

విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. స్టాంప్ పేపర్ లైసెన్స్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లుగా తిష్ట వేసి ప్రజలను పీడిస్తున్నారు. పన్నులు, ఫీజులు, TDS చెల్లించినా ఆస్తి విలువను బట్టి 1% వరకు వారికి అదనంగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చలానాలు, ఫీజులు నేరుగా చెల్లించే అవకాశం లేకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటారు. దళారీ వ్యవస్థను పెకిలించాలని కోరుతున్నారు.
News November 6, 2025
విశాఖ: ఆదాయంలో సూపర్ బజార్ సబ్ రిజిస్ట్రార్ టాప్

ఈ ఆర్థిక సంవత్సరంలో విశాఖలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం గణనీయంగా పెరిగింది. మొదటి 7 నెలల్లోనే సుమారు రూ.600 కోట్ల ఆదాయం నమోదైనట్లు సమాచారం. సూపర్ బజార్, మధురవాడ కార్యాలయాలు అత్యధిక ఆదాయం సాధించగా.. అనందపురం, భీమునిపట్నం కార్యాలయాలు తక్కువ ఆదాయంతో చివర్లో నిలిచాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరలో పూర్తి కానుండడంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.


