News August 6, 2024

విశాఖలో గర్భం దాల్చిన బీ.టెక్ విద్యార్థిని

image

విశాఖలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన కలకలం రేపింది. విద్యార్థిని గ్రామానికి చెందిన ఓ యువకుడు నగరంలో బీ.టెక్ చదువుతున్నాడు. వీరిద్దరూ చనువుగా ఉండేవారు. ఈ క్రమంలో విద్యార్థిని గర్భం దాల్చడంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. గర్భంలో మృత శిశువును వైద్యులు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి మృతశిశువును బయటకు తీశారు.

Similar News

News September 11, 2024

విశాఖ: ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

image

విశాఖ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా లబ్ధిదారులను తీసుకెళ్లి జియో ట్యాగింగ్ చేయించాలన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులకు అన్ని విధాల సహకారం అందించాలన్నారు.

News September 10, 2024

విశాఖ: ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12న జాబ్ మేళా

image

విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ చేసినవారు అర్హులు. అశోక్ లేలాండ్ కంపెనీలో ఖాళీలు భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సెలక్ట్ అయిన వారికి దుబాయ్‌లో ఉద్యోగావకాశం అని పేర్కొన్నారు. వివరాలకు 9440197068 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News September 10, 2024

ఈనెల 17 వరకు సింహాచలంలో వార్షిక పవిత్రోత్సవాలు

image

సింహాచలం ఆలయంలో ఈనెల 13 నుంచి 17 వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, వేద పారాయణం, తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ఈనెల 13 నుంచి ఆర్జిత సేవలతో పాటు నిత్య కళ్యాణ ఉత్సవాలు కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంటల తర్వాత స్వామి దర్శనాలు లభించవన్నారు.