News January 26, 2025
విశాఖలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

విశాఖలోని ఆశీల్మెట్టలో యువకుడి మృతదేహం లభ్యమైంది. త్రీ టౌన్ ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఓ స్కూల్ గేట్ ఎదురుగా మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారని తెలిపారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఎస్ఐ సురేష్ కోరారు.
Similar News
News March 11, 2025
హయగ్రీవ భూములలో బోర్డులు పాతిన అధికారులు

ఎండాడలో హయగ్రీవ డెవలపర్స్కు కేటాయించిన 12 ఎకరాల 51 సెంట్ల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వృద్ధులకు ఓల్డేజ్ హోం నిర్మాణం పేరుతో తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు విచారణలో తేలింది. దీంతో వెంటనే ఈ భూమి స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు ఆ భూమిలో బోర్డులు పాతారు.
News March 11, 2025
విశాఖలోని 13 రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని 13 రైతు బజార్లలో మంగళవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు.(రూ/కేజీలలో) టమాటా కేజీ రూ.13, ఉల్లి రూ.27, బంగాళాదుంప రూ.15, నల్లవంకాయలు రూ.30, బెండకాయలు రూ.42, మిర్చి రూ.32, దొండ రూ.38, బరబాటి రూ.38, క్యారెట్ రూ.30/38, వెల్లుల్లి రూ.90/100గా, బీట్ రూట్ రూ.24, కీరా రూ.22, గ్రీన్ పీస్ రూ.50, పెన్సిల్ బీన్స్ రూ.50, కాకర కాయ రూ.44, పొటల్స్ రూ.90, చేమదుంప రూ.34గా నిర్ణయించారు.
News March 11, 2025
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని వినతి

విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ సోమవారం విజయవాడలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖలో హైకోర్టు బెంచ్, క్యాట్, జిల్లా కోర్టు ఆవరణలో గత 10నెలలుగా మూతపడ్డ క్యాంటీన్ తెరవాలని కోరారు. కొత్త కోర్టు బిల్డింగుల్లో ఎయిర్ కండిషన్ సదుపాయం కల్పించాలని విన్నవించారు. బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.