News February 28, 2025
విశాఖలో చిట్టీల పేరుతో మోసం

విశాఖలో చిట్టీల పేరుతో మోసం చేసిన దంపతులు అరెస్ట్ అయ్యారు. మల్కాపురానికి చెందిన దంపతులు మోహన్ రావు, లక్ష్మి చిట్టీల పేరుతో తనను మోసం చేశారని పెద్ద గంట్యాడకు చెందిన లక్ష్మీ న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనే వీరి వ్యవహరంపై సీపీని బాధితులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యూపోర్ట్ CI కామేశ్వరరావు వీరిద్దరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు. మార్చి 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
Similar News
News March 27, 2025
విశాఖలో డ్రగ్స్ కలకలం

విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ డార్మెటరీలో 6.5 గ్రాముల ఎం.డి.ఎం.ఏతో కర్ణాటకకి చెందిన రంగస్వామి నంజి గౌడ (23)గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. అయితే నంజి గౌడ చాలాసార్లు సిటీకి వచ్చినట్లు సమాచారం. అతను ఎవరికి డ్రగ్స్ అమ్ముతున్నాడో తెలియాల్సి ఉంది.
News March 27, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

అన్నవరం నుంచి విశాఖ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. తుని ఎస్‌ఐ విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన పద్మ (48) అన్నవరంలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లింది. బుధవారం అక్కడి నుంచి తన కుమారుడి బైక్‌పై విశాఖ వస్తుండగా తుని RTC కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్‌పై కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కింద పడిపోయారు. ఆమె పైనుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
News March 27, 2025
వాగన్ పోహ్ వర్క్‌షాప్ తనిఖీ చేసిన DRM

వడ్లపూడిలో ఉన్న వ్యాగన్ పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను DRM లలిత్ బోహ్రా బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్‌లోని వివిధ పీవోహెచ్ సౌకర్యాలు, యంత్రాలు, కార్యాలయాన్ని పరిశీలించారు. రైల్వే వ్యాగన్‌ల లభ్యతను పెంచడానికి లక్ష్య ఉత్పత్తిని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా జగ్గయ్యపాలెంలో కంటైనర్ కార్పొరేషన్‌లో సౌకర్యాలను పరిశీలించారు.