News March 3, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు
➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలు
➤ రుషికొండ బ్లూ ఫ్లాగ్ ఇష్యూ పై జేసీ సమీక్ష
➤ వాట్సాప్‌లో పదో తరగతి హాల్ టికెట్లు
➤ ఈ నెల 6న ఒకే వేదికపై దగ్గుపాటి పురంధేశ్వరి, చంద్రబాబు
➤ ఈ నెల 4వ తేదీ నుంచి అసంఘటిత కార్మికులు ధర్నా
➤ ప్రశాంతంగా ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు
Similar News
News March 4, 2025
ఉత్తరాంధ్ర టీచర్ల MLC.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

➤ గాదె శ్రీనివాసులు నాయుడు: 12,035(గెలుపు)
➤ పాకలపాటి రఘువర్మ : 8,527
➤ కోరెడ్ల విజయ గౌరీ : 5,900
➤ నూకల సూర్యప్రకాశ్ : 89
➤ పోతల దుర్గారావు : 68
➤ సుంకర శ్రీనివాసరావు : 39
➤ రాయల సత్యనారాయణ : 32
➤ కోసూరు రాధాకృష్ణ : 31
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి : 15
➤ పెదపెంకి శివప్రసాద్ : 15
➤ ఇన్ వ్యాలీడ్ : 656
News March 4, 2025
ధ్రువపత్రంతో గాదె శ్రీనివాసులునాయుడు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులునాయుడు ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి హరేంధిర ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. ఆయనకు ఎన్నికల సంఘం ధ్రువపత్రాన్ని అందజేశారు. ఎలిమినేషన్ ప్రక్రియలో పదో రౌండ్లో పాకలపాటి రఘువర్మకు లభించిన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను ప్రకటించారు. శ్రీనివాసులు నాయుడికి 12,035 ఓట్లు వచ్చాయి.
News March 4, 2025
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా అభ్యంతరాల స్వీకరణ

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీ లోపు తన కార్యాలయంలో అభ్యంతరాల వివరాలు నమోదు చేసి అందజేయాలన్నారు.10వ తేదీ తర్వాత అభ్యంతరాలు స్వీకరించమన్నారు.