News March 5, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖలో ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్
➤ దివ్యాంగుల పారా స్టేడియం కోసం స్థల పరిశీలన
➤ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు స్టేడియం సిద్ధం
➤ మార్చి 17 నుంచి 134 కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు
➤ నేడు విద్యుత్ ప్రధాన కార్యాలయంలో లైన్‌మ్యాన్ దివస్
➤ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు
Similar News
News March 5, 2025
విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ముఖ్య అధికారులు, బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.
News March 5, 2025
గాజువాకలో భారీ చోరీ

గాజువాక సమీపంలో గల కాపు జగ్గరాజుపేట STBL వసుంధర గార్డెన్స్‌లో చోరీ జరిగింది. ఉమ అనే మహిళ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వసుంధర గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న ఉమ తన తల్లిని చూసేందుకు వెళ్లి రాత్రి అక్కడే ఉండిపోయింది. బుధవారం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులకొట్టి ఉన్నాయని, సుమారు 75 తులాలు బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 5, 2025
బ్లూఫ్లాగ్ పునరుద్దరణకు యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టాలి: కలెక్టర్

బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ జరిగేలా రుషికొండ బీచ్‌లో యుద్ధప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన రుషికొండ బీచ్‌ను సందర్శించారు. పరిశసరాల్లో కలియతిరిగిన ఆయన అక్కడ పరిస్థితులను గమణించారు. పర్యాటకుల వాహనాల పార్కింగ్ పరిశీలించారు. దుకాణాల సముదాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.