News October 3, 2024

విశాఖలో టెట్ పరీక్షకు 3439 మంది హాజరు

image

విశాఖలో గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 3931 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 3439 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మొత్తం 492 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. నగరంలో ఉదయం 5 కేంద్రాల్లోనూ మధ్యాహ్నం మూడు కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుచ్చిరాజుపాలెం సెంటర్‌ను సందర్శించినట్లు తెలిపారు.

Similar News

News November 2, 2024

ఎవరినైనా ఇబ్బంది పెట్టామా: సీఎం చంద్రబాబు

image

విజయనగరం జిల్లాలో ఎన్నికల కోడ్ రావడంతో ప్రోగ్రాం పరవాడకు మార్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాత్రి రాత్రికి ప్రోగ్రాం మార్చినా ఎక్కడైనా పరదాలు కట్టామా, చెట్లు కొట్టామా, ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి అరెస్ట్ చేయించామా అన్నారు. రోడ్లు బాగోలేక RTC బస్సులను నిలిపివేశారని పేర్కొన్నారు. గుంతలతో ప్రయాణీకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మంచి రోజులు వచ్చాయని ఈ గ్రామం నుంచే మంచి రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామన్నారు.

News November 2, 2024

సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు: సీఎం చంద్రబాబు

image

వెన్నెలపాలెంలోని సభలో CM చంద్రబాబు రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై మాట్లాడారు. పరవాడ జంక్షన్ స్ఫూర్తిగా సంక్రాతి నాటికి రాష్ట్రాన్ని గుంతలు లేని రోడ్లుగా మార్చాలని R&B మంత్రికి సూచించారు. YCP ఐదేళ్లలో రహదారులను పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయన్నారు. ఈ రోడ్లు చూశాక గర్భిణీలకు ఆస్పత్రికి వెళ్లే పనిలేకుండా రోడ్లపైనే డెలివరీ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.

News November 2, 2024

విశాఖ: నేడు రుషికొండ భవనాలను పరిశీలించనున్న సీఎం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో రుషికొండకు చేరుకుంటారు. గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలిస్తారు. తర్వాత అక్కడి నుంచి కలెక్టరేట్‌‌‌కు వెళతారు. అక్కడ సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్లో ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్తారు.