News June 4, 2024

విశాఖలో టేబుల్స్ వారిగా కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు

image

ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ మంగళవారం ఉదయం 5.00 గంటలకు టేబుళ్ల వారీ కౌంటింగ్ సిబ్బందిని కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ పరిశీలకులు అమిత్ శర్మ, ఇతర పరిశీలకుల సమక్షంలో ఏయూ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్వో రూమ్ నుంచి ఆయన మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.

Similar News

News December 6, 2025

విశాఖలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంఖుస్థాపన

image

విశాఖ తూర్పు నియోజకవర్గం ముడసర్లోవలో రూ.62 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు ఎంపీ శ్రీభరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి శంఖుస్థాపన చేశారు. రాష్ట్రానికి మంజూరైన 5 హాస్టళ్లలో 3 విశాఖకే దక్కడం విశేషం. సీఎం చంద్రబాబు కృషి, కేంద్ర నిధుల సద్వినియోగంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని విప్ చిరంజీవిరావు తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనం ఉద్యోగినులకు సురక్షిత వసతిని అందిస్తుందన్నారు.

News December 6, 2025

విశాఖ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల కష్టాలు

image

విశాఖ విమానాశ్రయంలోనూ అయ్యప్ప స్వాములు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా చుక్కలు చూపిస్తున్న ఇండిగో సర్వీసులు శనివారం కూడా రుద్దయ్యాయి. శబరిమల వెళ్లేందుకు నగరం నుంచి చాలామంది ముందుగానే విమాన టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా అన్ని సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రయాణికులకు మెసేజ్‌లు పంపింది. దీంతో స్వాములు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.

News December 6, 2025

విశాఖ: క్రికెట్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలివే

image

భారత్-దక్షిణాఫ్రికా వన్డే సందర్భంగా విశాఖ పోలీసులు పార్కింగ్ మార్గదర్శకాలు విడుదల చేశారు. వీఐపీలు NH-16 ద్వారా నేరుగా స్టేడియానికి చేరుకోవాలి. నగరం నుంచి వచ్చే వారు సాంకేతిక కాలేజీ వద్ద, శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే వారు కార్ షెడ్, మిధిలాపురి వద్ద పార్క్ చేయాలి. బీచ్ రోడ్ నుంచి వచ్చే వారికి MVV సిటీ, ఆర్టీసీ బస్సులకు లా కాలేజీ వద్ద స్థలం కేటాయించారు.