News March 18, 2024
విశాఖలో ‘టైగర్ ట్రయాంఫ్–2024’ విన్యాసాలు

భారత్, యూఎస్ మధ్య రక్షణ బంధం బలోపేతానికి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో టైగర్ ట్రయాంఫ్–2024 సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 31 వరకూ రెండు ఫేజ్‌లలో విన్యాసాలు జరగనున్నాయి. యూఎస్‌కు చెందిన యూఎస్‌ఎస్ సోమర్‌సెట్ యుద్ధ నౌకతో పాటు ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, యూఎస్ మెరైన్ కార్ప్స్, ఎమ్మార్కెడ్ దళాలు విశాఖకు చేరుకున్నాయి.
Similar News
News April 13, 2026
ఏప్రిల్ 17న సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు: ఈవో

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న గంధం అమావాస్యను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. 16న సాయంత్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రాత్రి కొండదిగువన వరాహ పుష్కరిణి వద్ద, కొండపైన జాగరం చేసి అమావాస్య రోజు దర్శించుకోవడం ఆనవాయితిగా వస్తోంది. కావున ఏప్రిల్ 17న ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఈవో వెంకట్రావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News April 12, 2026
విశాఖ: రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 12, 2026
విశాఖ ప్రజలకు గమనిక.. ఈ నెల 30 వరకే గడువు

2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీను ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించిందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఈ నెల 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటును ఇవ్వనున్నట్లు తెలిపారు.


