News November 21, 2024
విశాఖలో ట్రాఫిక్ ఎస్ఐ, రైటర్ సస్పెండ్
విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎన్వి భాస్కరరావును, రైటర్ సీహెచ్.జయరావును గురువారం సాయంత్రం పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి నగదు తీసుకొని కేసును డిస్పోజ్ చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు కమిషనర్ దర్యాప్తు చేసి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కోరారు.
Similar News
News November 25, 2024
మరోసారి నెం.1గా నిలిచిన విశాఖ
చిన్న తరహా పరిశ్రమల(MSME) ఏర్పాటులో రాష్ట్రం వేగంగా పుంజుకుంటోంది. సామాజిక ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం విశాఖలో రూ.648.4 కోట్ల పెట్టుబడితో 16,505 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీంతో విశాఖ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, నెల్లూరు ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 968 యూనిట్లు, పార్వతీపురం మన్యంలో 2,213 యూనిట్ల పరిశ్రమలు ఏర్పడ్డాయి.
News November 25, 2024
విశాఖ: నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిలకడగా కొనసాగుతోంది. ఇది ఆదివారం అర్ధరాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ-వాయవ్య దిశగా విస్తరించింది. బాగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం వాయుగుండంగా మారనుందని విశాఖ హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. మంగళవారం మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు
News November 25, 2024
టెండర్ల ఆహ్వానంపై విశాఖ ఎంపీ స్పందన
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడంపై విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పందించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నట్లు ఎంపీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. జోన్ స్థాపనలో కీలకపాత్ర పోషించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జోన్ ద్వారా ఉత్తరాంధ్రకు భారీ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అన్నారు.