News November 21, 2024

విశాఖలో ట్రాఫిక్ ఎస్‌ఐ, రైటర్‌ సస్పెండ్

image

విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎన్‌వి భాస్కరరావును, రైటర్ సీహెచ్.జయరావును గురువారం సాయంత్రం పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి నగదు తీసుకొని కేసును డిస్పోజ్ చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు కమిషనర్ దర్యాప్తు చేసి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కోరారు.

Similar News

News December 2, 2024

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు టైలర్స్ వినతి 

image

విశాఖ జిల్లా టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఆదివారం విశాఖలో కలిశారు. ఈ సందర్బంగా టైలర్స్ సమస్యలపై వినతి పత్రం అందజేసారు. టైలర్స్ కు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 50 సంవత్సరాలు దాటిన టైలర్స్‌కి పెన్షన్ ఇవ్వాలని కోరారు. విశాఖ జిల్లా అధ్యక్షులు కూనూరు మళ్ళికేశ్వరరావు, టైలర్స్ పాల్గొన్నారు.

News December 1, 2024

దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌కు విశాఖ జట్టు ఎంపిక

image

గాజువాక జింక్ మైదానంలో ఈనెల 9 నుంచి 11 వరకు నిర్వహించే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌కు విశాఖ జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేసినట్లు నిర్వాహకులు మణికంఠ, హేమ సుందర్ తెలిపారు. మొట్టమొదటిసారిగా జరిగే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంటులో 10 జిల్లాల నుంచి పది టీములు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. 

News December 1, 2024

విశాఖలో వర్షం.. మ్యాచ్ రద్దు

image

విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరగాల్సిన ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 2 రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత కొన్ని రోజులుగా విశాఖలో మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే.