News February 15, 2025
విశాఖలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు శనివారం గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ ఆఫీసులు, పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News March 19, 2025
విశాఖ: చిన్న శ్రీను కుమారుడి మృతి

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందాడు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.
News March 19, 2025
ట్రాన్స్‌జెండర్ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి అనకాపల్లి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సీఎంకు తెలిపారు. కాగా ట్రాన్స్‌జెండర్‌ను చంపి ముక్కలుగా నరికి మూట కట్టి కశింకోట(M) బయ్యవరం వద్ద పడేసిన సంగతి తెలిసిందే.
News March 19, 2025
గాజువాక ఐటీఐలో నేడు జాబ్ మేళా

గాజువాక ఐ.టి.ఐలో నేడు జాబ్ మేళా జరగనుంది. అప్రెంటీస్‌తో పాటు నిరుద్యోగులు ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లుతో రావాలని ఐటీఐ ప్రిన్సిపల్ కె.ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. పదవతరగతి, ఐటీఐ, డిగ్రీ విద్యార్హతతో పాటు 18నుంచి 35ఏళ్లలోపు అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని అన్నారు. జిల్లా నైపుణ్యభివృద్ధిసంస్థ, ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని అయన తెలిపారు.