News January 8, 2025
విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు

ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12 గంటలకు నగరానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం 4.45గంటలకు ప్రధాని, సీఎంతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Similar News
News November 18, 2025
రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ

సింహాచలం దేవస్థానంలో అప్పన్న స్వామిని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. మంగళవారం సింహాచలం వచ్చిన బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఏఈవో తిరుమల ఈశ్వరరావు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అఖండ-2 సినిమా సాంగ్ను విడుదల చేయనున్నారు.