News March 27, 2025
విశాఖలో డ్రగ్స్ కలకలం

విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ డార్మెటరీలో 6.5 గ్రాముల ఎం.డి.ఎం.ఏతో కర్ణాటకకి చెందిన రంగస్వామి నంజి గౌడ (23)గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. అయితే నంజి గౌడ చాలాసార్లు సిటీకి వచ్చినట్లు సమాచారం. అతను ఎవరికి డ్రగ్స్ అమ్ముతున్నాడో తెలియాల్సి ఉంది.
Similar News
News April 24, 2025
టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై సమీక్ష

విశాఖ కలెక్టరేట్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై గురువారం సమీక్ష జరిగింది. ఏపీ టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ జీవో నం.39 ప్రకారం ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్లకు లోన్స్‌పై బ్యాంకు అధికారులతో చర్చించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News April 24, 2025
ఈనెల 26న GVMC డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

GVMC డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఈనెల 26న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈనెల 26న ఉదయం 11 గంటలకు GVMC కౌన్సిల్ హల్లో నిర్వహించనున్నారు. ఆరోజున సమావేశానికి హాజరవుతున్న సభ్యులు మొబైల్ ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవాలన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్లు, కార్పొరేటర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
News April 24, 2025
పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహికులకు పూర్తి సహకారం: కలెక్టర్

పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక ఔత్సాహికులకు అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణాలకు, పరిశ్రమల నిర్వహణకు అవసరమైన నీటి వనరులను సమకూర్చాలన్నారు. భూ సేకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ అంశాల్లో వేగం పెంచాలని ఆదేశించారు.