News June 4, 2024

విశాఖలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్

image

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధి ఈసీఈ బ్లాక్‌లో ఏర్పాటుచేసిన పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ల స్ట్రాంగ్ రూమ్ ను నిబంధనల ప్రకారం మంగళవారం ఉదయం 6.30 గంటలకు తెరిచారు. అందులో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు ప్రత్యేక వాహనం ద్వారా ఎస్కార్ట్ సాయంతో ఈసీఈ బ్లాక్‌లో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. అభ్యర్థులు, ఏజెంట్లు, ఇతర అధికారుల సమక్షంలో కలెక్టర్ మల్లికార్జున ఈ ప్రక్రియ నిర్వహించారు.

Similar News

News September 17, 2025

విశాఖలో పార్టనర్షిప్ సమ్మిట్-2025

image

నవంబర్ 14,15తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా పార్టనర్షిప్ సమ్మిట్-2025 నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లండన్‌లోని నారా లోకేశ్ గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో దూసుకెళ్తున్నామని చెప్పారు. పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం అయ్యారు.

News September 17, 2025

జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన విశాఖ మేయర్

image

విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లతో కలిసి అధ్యయన యాత్రలో భాగంగా జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బుధవారం సందర్శించారు. జైపూర్ మేయర్ డా.సౌమ్య గుర్జర్‌ను శాలువ వేసి సత్కరించగా, ఆమె కూడా విశాఖ మేయర్‌కు మెమెంటో అందించారు. జైపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషన్ విధానాలు, టూరిజం చర్యలపై అధికారులు వివరాలు అందించారు.

News September 17, 2025

విశాఖ: మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి బుధవారం మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాకు చెందిన విస్మద్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.