News November 10, 2024
విశాఖలో తొలి స్కై స్క్రాపర్ నిర్మాణం..!
విశాఖలో తొలి స్కై స్క్రాపర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బీచ్ రోడ్డులో ఐకానిక్ తాజ్ గేజ్ వే హోటల్ స్థానంలో వరుణ్ గ్రూప్ దీన్ని నిర్మించనుంది. రూ.600 కోట్లతో 24 ఫ్లోర్లలో ఆఫీస్ స్పేస్, హోటల్, స్టూడియో నిర్మిస్తారు. రూ.120 కోట్లతో తాజ్ గేట్ వే హోటల్‌ను 2018లో ఓరియెంటల్ హోటల్స్ లిమిటెడ్ నుంచి వరుణ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈనెల 14 నుంచి గేట్ వే హోటల్ కూల్చివేత పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.
Similar News
News December 8, 2024
ఏయూకి పూర్వవైభవం తీసుకురావడానికి సహకరించాలి: లోకేశ్
ఏయూకి పూర్వ వైభవం తీసుకురావడానికి సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏయూ అలుమ్నీ మీట్‌లో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్ 100లో ఏయూని ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయూని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ పాల్గొన్నారు.
News December 7, 2024
పోలీసు స్టేషన్‌ను ప్రారంభించనున్న హోం మంత్రి అనిత
విశాఖ ఆరిలోవలో నిర్మించిన నూతన పోలీసు స్టేషన్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పాల్గొనున్నారు. సుమారు ఆరేళ్ల నుంచి ఈ భవన నిర్మాణానికి మీనమేషాలు లెక్కిస్తూ నేటికి నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాటు చేశారు.
News December 7, 2024
పెందుర్తి: మాదకద్రవ్యాలపై పోస్టర్ ఆవిష్కరణ
విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.