News February 25, 2026

విశాఖలో దారుణం.. భార్యను చంపేసిన భర్త

image

విశాఖ(D) ఆరిలోవ బాలాజీ నగర్‌లో భార్యను, భర్త చంపేసిన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడే ఉంటున్న బురదపాటి దేముడు, దుర్గ(33)కు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం ఇదే తరహాలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకోగా చున్నీని ఆమె మెడకు చుట్టి చంపేసి ఇంట్లో దాక్కున్నాడు. దుర్గ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని సీఐ మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 18, 2026

కర్నూలు: 10కి చేరిన మృతుల సంఖ్య

image

మంత్రాలయం(M) చిలకలడోణ గ్రామ సమీపాన గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగిన రోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన దీపిక, బెల్లి, యశోద, పుట్టమ్మ, లాలాక్షి, మీనాక్షి, సునీల్, కుమార్ మృతిచెందారు. కర్నూలు GGHలో చికిత్స పొందుతూ తేజస్విని శుక్రవారం మృతి చెందింది. నేడు శోభ అనే మహిళ మరణించింది. మరికొందరు చికిత్స పొందుతున్నారు.

News April 18, 2026

ఈ ఆహారంలో పుష్కలంగా విటమిన్ B12

image

విటమిన్ B12 <<19680368>>లోపాన్ని<<>> నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ‘శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి’ అని వివరిస్తున్నారు.

News April 18, 2026

ఉమ్మడి KNR జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా గోదూరు 44.2℃తో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. అల్లీపూర్లో 44.1℃గా నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి-ధర్మారంలో 44.1, వీణవంక 43.8℃, పెద్దపల్లి జిల్లా రామగుండం 44, ఆకెనపల్లి 43.9℃, రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి 43.5, పెద్దలింగాపురంలో 43.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.