News March 22, 2025

విశాఖలో దొంగలు దొరికారు..!

image

కేబుల్ వైర్ల దొంగలు విశాఖ పోలీసులకు చిక్కారు. విశాఖ R&Bఆఫీసు సమీపంలోని ఏకలవ్య కాలనీకి చెందిన పిట్టోడు, ఏలూరుకు చెందిన శ్రీను గతంలో కేబుల్ వైర్ పనులు చేశారు. ఎంతో విలువైన ఆవైర్లను కొట్టేయడానికి ప్లాన్ వేశారు. BSNLల్యాండ్ లైన్ ఫోన్లు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోరనుకున్నారు. MVP డబుల్ రోడ్డులో రాత్రి వేళ గుంతలు తవ్వి టెలిఫోన్ వైర్లను దొంగలించారు. పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.

Similar News

News March 25, 2025

విశాఖ రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు

image

విశాఖ రైతు బజార్‌లలో మంగళవారం నాటి కూరగాయల ధరలు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లిపాయలు రూ.23, బంగాళ రూ.15, టమాటలు రూ.15, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.27/32/40,కాకరకాయలు రూ.38, ఆనపకాయ రూ.14, బీరకాయలు రూ.42, క్యాబేజి రూ.12, కాలి ఫ్లవర్ రూ.20, దొండకాయలు రూ.30,బీట్ రూట్ రూ.20,పొటల్స్ రూ. 46,మునగకాడలు రూ.28, క్యారట్ రూ.20,కీరా దోసకాయ రూ.22,మామిడి కాయలు రూ.40గా నిర్ణయించారు.

News March 25, 2025

విశాఖ తీరంలో హీట్ పెంచుతున్న మేయర్ పీఠం ..!

image

విశాఖ తీరంలో GVMC మేయర్ పీఠం హీట్ పెంచుతోంది. మేయర్ పదవి దక్కించుకునేందుకు కూటమి కదుపుతున్న పావులను YCP తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నాయకులు ఇటీవల కలెక్టర్‌కు వినతి ఇవ్వగా.. అలెర్ట్ అయిన వైసీపీ అధిష్ఠానం క్యాంప్ రాజకీయాలకు తెరలేపినట్లు సమాచారం. ఇప్పటికే 28 మంది YCP కార్పొరేటర్లను బెంగళూరు తరలించారు. అక్కడి నుంచి ఊటీ టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.  

News March 25, 2025

భీమిలి బీచ్‌లో నిర్మాణాల తొలగింపు

image

భీమిలి బీచ్‌లోని కోస్తా నియంత్రణ మండలి పరిధిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ నిర్మించిన ప్రహరీ, వాటి పునాదుల తొలగింపునకు జీవీఎంసీ సుమారు రూ.కోటి వెచ్చిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించి ఈ నెల 26 కల్లా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో జీవీఎంసీ అధికారులు విరామం లేకుండా యంత్రాలతో పనిచేయిస్తున్నారు.

error: Content is protected !!