News March 22, 2025
విశాఖలో దొంగలు దొరికారు..!

కేబుల్ వైర్ల దొంగలు విశాఖ పోలీసులకు చిక్కారు. విశాఖ R&Bఆఫీసు సమీపంలోని ఏకలవ్య కాలనీకి చెందిన పిట్టోడు, ఏలూరుకు చెందిన శ్రీను గతంలో కేబుల్ వైర్ పనులు చేశారు. ఎంతో విలువైన ఆవైర్లను కొట్టేయడానికి ప్లాన్ వేశారు. BSNLల్యాండ్ లైన్ ఫోన్లు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోరనుకున్నారు. MVP డబుల్ రోడ్డులో రాత్రి వేళ గుంతలు తవ్వి టెలిఫోన్ వైర్లను దొంగలించారు. పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
Similar News
News April 25, 2025
ఏయూ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్‌లో హాజరు సరిగ్గా లేదని 30మంది విద్యార్థుల హాల్ టికెట్స్ ఇవ్వకపోవడం ఘోరమన్నారు. ఈ విషయంపై గురువారం ఏయూ వీసీ ఆఫీస్ వద్ద AISF నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈవిషయం వీసీ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేదని నిరసన చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శశిభూషణరావు స్పందించి శుక్రవారం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
News April 25, 2025
విశాఖలో 97 మంది పోలీసులకు రివార్డులు

విశాఖ నగర పరిధిలో ప్రతిభ కనబర్చిన 97 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి గురువారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెల రివార్డులను అందజేస్తున్నారు.
News April 24, 2025
జ్ఞానాపురం చర్చి మైదానంలో బాలిక మృతదేహం

విశాఖలోని జ్ఞానాపురం చర్చి మైదానంలో అనుమానస్పద స్థితిలో పడి ఉన్న 11 ఏళ్ల బాలిక మృతదేహాన్ని చర్చి ప్రతినిధులు గుర్తించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతి పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలిలోనే బాలిక తల్లి, అమ్మమ్మ ఉన్నారు.