News November 13, 2024
విశాఖలో నకిలీ పోలీస్ హల్ చల్
పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీసు అవతారమెత్తిన వంతల సంతోష్(32)ని స్థానిక క్రైమ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైవేపై వంతెన వద్ద పోలీస్ యూనిఫామ్ ధరించి ఫోన్ అమ్మేందుకు యత్నింస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా.. పాడేరుకు చెందిన సంతోఫ్పై ఇదివరకే ఆరిలోవ స్టేషన్లో 2 కేసులు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News November 15, 2024
విశాఖ: గోస్తనీలో కారు బోల్తా.. డ్రైవర్ మృతి
తగరపువలస గోస్తని నదిలో కారు బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. వంతెనపై అంధకారం నెలకొనడంతో గురువారం రాత్రి కారు అదుపుతప్పి నదిలో బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో స్థానికులతో పాటు పోలీసులు సహాయకు చర్యలు చేపట్టారు. మృతుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ సిబ్బందికి చెందిన డ్రైవర్గా పోలీసులు గుర్తించారు. మరి కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
News November 15, 2024
ఏయూ: ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షలు భాగం అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేసి ఏయూ వెబ్ సైట్లో ఉంచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 14, 2024
ఏయూ: రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
ఎంటెక్, ఎంప్లానింగ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి వెబ్ సైట్లో పొందుపరిచినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. విద్యార్థులు ఏయూ వెబ్ సైట్ నుంచి తమ రిజిస్ట్రేషన్ (హాల్ టికెట్) నెంబర్ ఉపయోగించి పరీక్షా ఫలితాలను పొందవచ్చును.