News August 25, 2024
విశాఖలో నగరవనం అభివృద్ధి చేస్తాం: పవన్ కళ్యాణ్

రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా ఆయా నగరాల్లో వనాలను అభివృద్ధి నిధులు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలోని ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్లో నగర వనాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 10, 2026
విశాఖ: సంక్రాంతి వేళ రైతు బజార్లకు సెలవు రద్దు

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రైతు బజార్లకు ఉండే వారాంతపు సెలవులను రద్దు చేస్తున్నట్లు DD శ్రీనివాస్ కిరణ్ తెలిపారు. ఈ మంగళవారం, బుధవారం కూడా రైతు బజార్లు యథావిధిగా తెరిచే ఉంటాయని వెల్లడించారు. పండుగకు అవసరమైన కూరగాయలు, సరుకుల కొనుగోలు కోసం ప్రజలు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News January 10, 2026
బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన

బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శనివారం వేకువజాము నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తులసీదళార్చనలు చేపట్టారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
News January 10, 2026
ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయరాదు: డీటీసీ

విశాఖలో ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో డీటీసీ ఆర్సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. దూర ప్రయాణాల కోసం తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలని, ప్రతి బస్సులో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చలని ఆదేశించారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయొద్దని.. బస్సుల్లో హెల్ప్ లైన్ నంబర్ 9281607001 స్పష్టంగా పెట్టాలన్నారు.


