News July 19, 2024
విశాఖలో నేడు పాఠశాలలకు సెలవు

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈఓ చంద్రకళ ఉదయం ప్రకటన విడుదల చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు దీనిని పాటించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 6, 2025
‘జీవీఎంసీ స్థాయి సంఘంలో అభివృద్ధి పనులకు ఆమోదం’

విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు నగర మేయర్, స్థాయి సంఘం చైర్పర్సన్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొత్తం 287 అంశాలై చర్చించగా, 222 ప్రధాన అంశాలు, 30 టేబుల్ అజెండాలకు ఆమోదం లభించిందన్నారు.
News December 6, 2025
విశాఖలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష

విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్తో పాటు EROలు, AEROలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ శనివారం ప్రత్యేకంగా సమీక్షించారు. 2002 నాటి జాబితాను 2025తో సరిపోల్చాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 24.54% మ్యాపింగ్ పూర్తైనట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వివరించారు. వలసల వల్ల క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నాయని అధికారులు ఆయనకు వివరించారు.
News December 6, 2025
విశాఖ: రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాట్లకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖలో 12 రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శనివారం తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఖాళీ అవుతున్న 25 డ్వాక్రా మహిళలు, ఆరు PHC స్టాల్స్కు డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను గోపాలపట్నం మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో అందజేయాలి.


