News September 26, 2024
విశాఖలో నేడు హెరిటేజ్ వాక్..
ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను, విశిష్టతను తెలిపేలా గురువారం విశాఖ టౌన్ హాలు నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల మీదుగా హెరిటేజ్ వాక్ నిర్వహించినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. హెరిటేజ్ వాక్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ అధికారి జ్ఞానవేణి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 10, 2024
విశాఖ: ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ప్రాధాన్యతను వివరించిన టాటా
ఇంటర్ డిసిప్లినరీ రీసర్చ్ జరపాల్సిన అవసరం ఉందని రతన్ టాటా అన్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో 2018 డిసెంబర్ 10న నిర్వహించిన పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏయూతో పరిశోధన రంగంలో కలసి పనిచేయడానికి, సంయుక్త పరిశోధనలు జరిపే దిశగా యోచన చేస్తామన్నారు. విభిన్న శాస్త్రాలను సమన్వయం చేస్తూ పరిశోధనలు జరపాలన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్నవారితో గ్రూప్ ఫొటో తీసుకున్నారు.
News October 10, 2024
విశాఖ: నిన్న గుడ్‌న్యూస్.. అంతలోనే..!
తమ కంపెనీ సేవలను విశాఖలో విస్తరించనున్నట్లు టీసీఎస్ ప్రతినిధులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 10 వేల మందికి ఉపాధిని కల్పిస్తామని వెల్లడించింది. విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి టాటా గ్రూప్ చేయూతనిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. నిన్న అధికారిక ప్రకటన రాగా.. ఈరోజు ఆ సంస్థ అధినేత రతన్ టాటా మృతి వార్త విశాఖ వాసులను కలచివేసింది. కాగా.. 2018 డిసెంబర్ 10న చివరిసారిగా రతన్ టాటా విశాఖలో పర్యటించారు.
News October 10, 2024
విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు
పండగల సీజన్‌లో విజయవాడ- శ్రీకాకుళం రోడ్డు-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. విజయవాడ శ్రీకాకుళం స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఈనెల 10 నుంచి 17(13 మినహా) వరకు ప్రతిరోజు విజయవాడ నుంచి రాత్రి బయలుదేరి శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం-విజయవాడ స్పెషల్ ఎక్స్ ప్రెస్ శ్రీకాకుళం నుంచి ఈనెల 10 నుంచి 18 వరకు(14 మినహా) నడుస్తుందన్నారు.